‘సింహాలు తమ చరిత్రను చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పేదే చరిత్ర అవు తుంది’ అంటాడు ‘మాదిగ పొద్దు’ పుస్తక సంకల నకర్త పసునూరి రవీందర్. ‘‘మాదిగ పొద్దు: సురేం దర్ మాదిగ స్మృతి కవిత్వం’’ ఈ దేశంలో వెలు వడిన బహు అరుదైన రకానికి చెందిన పుస్తకం. ఎస్సీ వర్గీకరణ పోరాట క్రమంలో అమరుడైన ఒక కొడుకు వీరోచిత గాథ గురించి, పెల్లుబుకుతున్న దుఃఖాన్ని దిగమింగుతూ, శక్తినంతా కూడగట్టుకొని సురేందర్ మాదిగ తండ్రి యాదయ్య పడిన యాతన పాఠకుల చేత కంట తడి పెట్టిస్తుంది. కొడుకు ఆశయాలను అత్యంత ఆత్మగౌరవంతో అక్షరీకరించటం అరుదైన సాహితీ సందర్భం. బ్రిటిష్ వాళ్ళు సింహ స్వప్నమైన యువకిశోరం రాజ్‌గురు అమరుడైనప్పుడు ఆయన తల్లి విలపిం చిందిట- కొడుకు చనిపోయినందుకు కాదు, భారతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి ఇంకొక కొడుకుంటే బావుండునని.
ఇది ఎంత వరకు సాధ్యమో అనుకోవచ్చు కాని, ఇక్కడ ఒక్కగా నొక్క కొడుకు సురేందర్ మాదిగ ఆహుతైనందుకు అంతంత మాత్రమే చదువున్న తండ్రి యాదయ్య ఆవేదన ఎంతో ఉన్నతమైనది. అందుకే అంటాడు ‘ఇంటికో సురేందర్ మాదిగ పుట్టాలని, తయారు కావాలని నా ఆశ’. ఈ పుస్తకం రెండు భాగాలు-మొదటి సింహ భాగం, కొడుకు సురేందర్ మాదిగ గురించి తండ్రి కన్నీటి ప్రవాహం. రెండవ భాగం సురేందర్ త్యాగం పై, మాదిగ ఉద్యమంపై మమకారంతో రాసిన కొన్ని ఎలిజీలు (శోక గీతాలు). ఆది నుండి వివక్షకు గురైన సురేందర్ బాల్యాన్ని గుర్తు చేసుకుంటాడు యాదయ్య. తాను నివాస ముంటున్న బస్తీలోని వినాయకుని మంటపంలోనికి అంటరానివాడని సురేందర్‌ను అనుమతించనందుకు తీవ్ర ఆవేద నకు గురౌతాడు. అందుకు ప్రతీకారంగా ఆ బ్రాహ్మ ణ, శూద్ర వినాయకుని ఎదురుగా మరొక చిన్న వినాయకుడిని నిలిపి, తల్లి చేత పులిహోర వండిం చి, నలుగురికి పంచి తన ప్రత్యేకతను చాటుకుం టాడు సురేందర్.
హైందవ దురహంకారానికి వ్యతిరేకంగా నారాయణ గురు సృష్టించిన అంట రాని రాముని వలె సురేందర్ నిలిపిన వినాయకుడు మాదిగ వినాయకుడు. ఈ నూతన దైవం మాదిగ ఆచార వ్యవహారాలను గౌరవించేవాడు. ఈ మాదిగ వినాయకుడిని ప్రతిష్ఠించే క్రమంలో జనాన్ని సమీకరించటం, తనలాగ వివక్షకు గురైనవారని ఎడ్యుకేట్ చేయటం వలన క్రమంగా అతనికి బాల్యంలోనే నాయకత్వ లక్షణాలు ఏర్పడ్డాయి. అణగారిన కులాల విముక్తికి బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన త్రిపద మంత్రంలోని మొదటి రెండు పదాలైన ‘సమీకరించు - బోధించు’ను కొడుకు ఆచరణలో చూపుతుంటే అబ్బురపడి పోతాడు యాదయ్య. ఈ నేపథ్యం సురేందర్ ఒక జాతి నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడు తుంది. అనేక అవమానాలకు, ఆటుపోట్లకు గురై ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా రాటుదేలి మాదిగ దండోరాను ఊరూరా వ్యాపింప చేయ టానికి మాదిగల మహా నాయకుడు మందక్రిష్ణ మాదిగకు కుడి భుజంగా మారుతాడు.
ఉద్యమ నిర్మాణంలో, వ్యాప్తిలో ఒక పూర్తి స్థాయి నాయ కుడుగా మారి అనేక పదవులనలంకరించి దండో రాకు తిరుగులేని ఆర్గనైజర్‌గా ఎదుగుతాడు. వర్గీకరణ ఉద్యమం అవలంబించిన వినూత్న ఎత్తుగడల్లో భాగంగా గాంధీభవన్ ముట్టడికి ఆయన నిర్ణయాన్ని గురించి రాస్తూ యాదయ్య ‘అసెంబ్లీ వలెనే, గాంధీభవన్ పైకెళ్ళి, కాంగ్రెస్ జెండాను దించి, దాని స్థానంలో ఎమ్మార్పీయస్ జెండాను ఎగురవేసి, వర్గీకరణ పట్ల ప్రభుత్వా నికున్న నిర్లక్ష్యానికి నిరసన తెలియజేయాల నుకున్నారు. అదే సమయంలో అడ్డుకునేవారిని బెదిరించటం కోసం పెట్రోల్ క్యాన్‌లను కూడా వెంట తీసుకెళ్ళారు. ముందుగా ఊహించిన విధంగా కాక వ్యూహం మారిపోయింది. గాంధీభవ న్ సెక్యూరిటీ అడ్డుకున్న సమయంలో ఏం చేయా లో తెలియక గోడల మీద పెట్రోల్ చల్లి వారిని నివారించాలనుకున్నారు. చల్లిన పెట్రోల్ పైన అగ్గిపుల్ల గీసిందెవరో తెలియదు’. ఈ విధంగా అమ రుడైన సురేందర్ చివరి క్షణంలో హాస్పిటల్‌లో మరణశయ్యపై ఉండి కూడా, తనను పరామర్శిం చటానికి వచ్చిన మందక్రిష్ణ మాదిగతో వర్గీకరణ సాధించి తీరాలని కోరుతూ కన్ను మూశాడు.
ఇందులో ముపె్పై ఎలిజీలు ఉన్నాయి. మాదిగ కవులు, వారి ఆశయాలతో మమేకమైన కవుల గీతా లు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి. ‘నిప్పు రెక్కల పక్షి’లో కవి తైదల అంజయ్య ‘పద్మవ్యూ హంలో అభిమన్యునికి /తిరి గొచ్చేదారి తెలియనట్టు/ భగత్ సింగ్/పార్లమెంట్ సెంట్రల్ హాలులో బాంబు పేల్చినట్టు/ ఉద్దమ్ సింగ్ డయ్యర్‌ను కాల్చి చంపి నట్టు’గా అభివర్ణిస్తాడు. ప్రఖ్యాత కవి, రచయిత ఎండ్లూరి సుధాకర్ ‘వంద జలందర్‌లు /వేల సురేందర్‌లు /వేగు చుక్కలై వస్తారు/ నిప్పు లోంచి లేస్తారు’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఉద్యమ కవి అమర్ తన ‘లాంగ్ మార్చ్’ కవితలో ‘తన గుండె డప్పుల చప్పుళ్ళ మధ్య/మహాజన ప్రభంజనాన్ని కలగంటు /మాదిగ లాంగ్ మార్చ్ చేస్తున్నది’ అని ఉద్యమ రూపాన్ని స్వప్నిస్తాడు. ప్రఖ్యాత ‘కుక్క’ నవలాకా రుడు, కవి వేముల ఎల్లయ్య ‘పత్తా తిరిగి ముట్టని ఉత్తరం, నీ ఇన్‌బాక్స్ తెరువు/లక్షల కొద్దీ అక్షరాలు నెత్తుటి అచ్చు కమిషన్‌లై/ఉచ్చు పురుగులై పేనుకుంటూ /వర్గీకరణే లక్ష్యంగా దండోర మోగుతది’ అని బహిరంగ ప్రకటన చేస్తాడు.
దళిత మార్క్సిస్టు కవి జిలుకర శ్రీనివాస్ ‘ఇంకా ఎందమంది ఒరుగాల్సి ఉందో/ ఇంకా ఎన్ని తలలు రాలాల్సి ఉందో/కృష్ణ భగవానులు నవ్వుతూనే ఉన్నాడు’ అని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తాడు. కవి కాశీం ‘అతడి జననం/ఒక తల్లి నొసటిపై పూసిన పువ్వు/అతడి మరణం/వేల తల్లుల గుండెపై కాలిన గాయం’ అని వర్గీకరణ క్రమంలో ఏర్పడిన లోతైన గాయాల్ని స్పృశిసాడు. కవి రచయిత దార్ల వెంకటేశ్వరరావు ‘మేము మాత్రం రెండు మెతుకుల కోసం/మా ప్రాణాల్ని/ సురేందర్‌లా జెండాను చేసి ఎగరేస్తాం /కలాల నిండా మా నెత్తురు సిరాగా నింపుతాం’ అని భవిష్య హామీని చూపిస్తాడు.
ఈ వర్గీకరణ పోరాటాన్ని కవి అంబటి వెంకన్న ‘అనేక అన్యాయాలు అవమానాలు /పరస్పర ఘర్షణ రూపమే/ వర్గీకరణ మహోజ్వల పోరాటం’ అని పేర్కొంటాడు. ఒక అసాధారణ సందర్భంలో, వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న ఈ పుస్తకం మాదిగలకే కాదు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రతి మనిషికి ఒక కరదీపిక. అణగారిన కులాల కథలు, వ్యథలు, కన్నీళ్ళు డాక్యు మెంట్ కాకపోతే అవి కనికరం లేని చరిత్ర కాల గర్భంలో కలిసే ప్రమాదం ఉంది. అందుకే శక్తినంతా కూడదీసుకొని తన కన్నీటికి పుస్తక రూప మిచ్చిన యాదయ్య అభినందనీయుడు.